వార్తలకు తిరిగి వెళ్లండి
బంగారం ధరకు మళ్లీ రెక్కలు

కింది స్థాయిలో కొనుగోళ్లు పెరగడం, రూపాయి క్షీణతతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర పుంజుకుంది. గురువారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర రూ.1,500 పెరిగి రూ.1,27,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్సు బంగారం ధర సుమారు 1 శాతం పెరిగింది.
వెండి ధర మాత్రం కిలోకు రూ.1.50 లక్షల వద్ద ఏడాది కనిష్ఠ స్థాయిలో కొనసాగింది.
Comments
Loading comments...
