వార్తలకు తిరిగి వెళ్లండి
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,950 తగ్గి రూ.1,14,200కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.3,220 పతనమై రూ.1,24,580 పలుకుతోంది.
కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులుండవచ్చు. ధరల తగ్గుదలతో కొనుగోలుదారులకు ఊరట లభించింది.
Comments
Loading comments...
