Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 4:32 PM జాతీయంGeneral
ఔషధాల ధరల వ్యత్యాసంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం - Ushodayam
మందుల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ), రిటైలర్ల కొనుగోలు ధర మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఔషధ తయారీదారులకు అనుకూలంగా వ్యవస్థ పనిచేస్తోందా అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం నిలదీసింది. భారత్‌లో మందుల ధరలు ప్రపంచంలోనే తక్కువగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఔషధ ధరలపై దాఖలైన రెండు పిటిషన్ల విచారణ అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Comments

G
Loading comments...