వార్తలకు తిరిగి వెళ్లండి

వాతావరణం చల్లబడటంతో దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండు 51 వేల మెగావాట్లు తగ్గింది. గత నెలలో రోజువారీ గరిష్ఠ డిమాండు 2.69 లక్షల మెగావాట్లుండగా, శనివారం 2.18 లక్షల మెగావాట్లకు పడిపోయింది.
దీంతో ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (ఐఈఎక్స్)లో మధ్యాహ్నం యూనిట్ విద్యుత్ ధర ఐదు పైసలకు తగ్గింది. అయితే సౌర విద్యుత్ ఉత్పత్తి తగ్గిన సాయంత్రం వేళ డిమాండు పెరగడంతో యూనిట్ ధర రూ.10కి చేరింది.
Comments
Loading comments...

