Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక వివాదాలతో తండ్రిని హత్య చేసిన కుమారుడు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 5:00 PM కరీంనగర్General
ఆర్థిక వివాదాలతో తండ్రిని హత్య చేసిన కుమారుడు - Ushodayam
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెల్లలో ఆర్థిక వివాదాల కారణంగా కుమారుడు లక్ష్మణ్ తన తండ్రి మేడిపల్లి వెంకటేశం (56)ను శనివారం హత్య చేశాడు. నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో బండరాయి, కర్రలతో తలపై దాడి చేయడంతో వెంకటేశం అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ ఆర్థిక వ్యవహారాలపై కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Comments

G
Loading comments...