Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యుద్ధాల ప్రభావంపై జైశంకర్‌-గటెరస్‌ చర్చ

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 6:16 AM జాతీయంGeneral
యుద్ధాల ప్రభావంపై జైశంకర్‌-గటెరస్‌ చర్చ - Ushodayam
భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఐరాస అధిపతి ఆంటోనియో గటెరస్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై చర్చించారు. కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం దక్షిణార్థగోళ దేశాలపై పడకుండా తగ్గించాల్సిన అవసరంపై గటెరస్‌తో చర్చించినట్లు జైశంకర్‌ తెలిపారు. ఐరాస సాధారణ సభ సమావేశాల వారంలో భాగంగా ఈ భేటీ జరిగింది.

Comments

G
Loading comments...