Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాన్సెన్‌ దెబ్బకు జడేజా నంబర్‌ వన్‌ గల్లంతు!

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 6:50 PM జాతీయంక్రీడలు
యాన్సెన్‌ దెబ్బకు జడేజా నంబర్‌ వన్‌ గల్లంతు! - Ushodayam
ఐసీసీ టెస్టు ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో యాన్సెన్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 మార్చి నుంచి నంబర్‌ వన్‌గా కొనసాగుతున్న భారత స్టార్‌ రవీంద్ర జడేజాను రెండో స్థానానికి నెట్టాడు. తాజా ర్యాంకింగ్స్‌లో యాన్సెన్‌ 451 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. జడేజాకు 422 పాయింట్లు ఉన్నాయి. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ యాన్సెన్‌ ఐదు స్థానాలు ఎగబాకి నంబర్‌ వన్‌గా నిలిచాడు.

Comments

G
Loading comments...