Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షూటర్ జయ్ పాల్ కు తొలి ఛాన్స్

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 1:28 PM జాతీయంక్రీడలు
షూటర్ జయ్ పాల్ కు తొలి ఛాన్స్ - Ushodayam
భారత షూటర్‌ జయ్‌పాల్‌ మాల్వియా 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌కు తొలి షూటింగ్‌ కోటా సాధించారు. దోహాలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 242.2 పాయింట్లతో రజత పతకం గెలిచారు. చైనాకు చెందిన కై హు 243.9 పాయింట్లతో స్వర్ణం సాధించగా.. చెక్‌ రిపబ్లిక్‌ షూటర్‌ జిండ్రిచ్‌ డుబోవీకి కాంస్యం దక్కింది.

Comments

G
Loading comments...