Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలు, ఈదురుగాలులకు నేలకొరిగిన వరి పంట

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 3:06 PM మహబూబాబాద్ General
వర్షాలు, ఈదురుగాలులకు నేలకొరిగిన వరి పంట - Ushodayam
మురసు తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు, ఈదురుగాలులకు కేసముద్రం మండలం బేరువాడ పరిధిలోని గుడి తండాకు చెందిన రైతు బోడ శ్రీను వరి పంట నేలకొరిగింది. కోతకు సిద్ధమైన పంట పూర్తిగా దెబ్బతినడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట చేతికందే సమయంలో నష్టపోయానని రైతు వాపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...