Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో ఎంపీటీసీ నామినేషన్‌ కేంద్రం వద్ద సందడి

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:52 PM విజయనగరంGeneral
వంగరలో ఎంపీటీసీ నామినేషన్‌ కేంద్రం వద్ద సందడి - Ushodayam
వంగర మండల ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్‌ కేంద్రం శుక్రవారం అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో సందడిగా మారింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో కేంద్రం వద్ద కోలాహలం నెలకొంది. అభ్యర్థులు మద్దతుదారులతో కలిసి పోలీసులు నిర్ణయించిన సరిహద్దు వరకు ర్యాలీగా చేరుకున్నారు. అనంతరం రిటర్నింగ్‌ అధికారి చంద్రకుమారికి నామినేషన్‌ పత్రాలు సమర్పిస్తున్నారు.

Comments

G
Loading comments...