వార్తలకు తిరిగి వెళ్లండి
వేసవి వినోదంగా ‘శక్తి శాలిని’?

‘సైయారా’తో గుర్తింపు తెచ్చుకున్న అనీత్ పడ్డా ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ చిత్రం ‘శక్తి శాలిని’. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో మడాక్ హారర్ యూనివర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విశాల్ జెత్వా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
బెంగాలీ జానపద కథల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనీత్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
