Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్రంలో కిరీటం చోరీ.. ఓటీటీకి సీక్వెల్‌!

Shruthi Nov 23, 2026 7:59 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
సముద్రంలో కిరీటం చోరీ.. ఓటీటీకి సీక్వెల్‌! - Ushodayam
‘ఆర్టికల్‌ 370’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న యామీ గౌతమ్‌ ప్రధాన పాత్రలో ‘చోర్‌ నికాల్‌ కే భాగ 2’ తెరకెక్కుతోంది. సన్నీ కౌశల్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మాడాక్‌ ఫిలింస్‌ నిర్మిస్తోంది. 2023లో వచ్చిన తొలి భాగంలో విమానంలో వజ్రాల చోరీ చూపించగా, రెండో భాగంలో క్రూజ్‌ నౌకలో ఖరీదైన కిరీటం దొంగతనం నేపథ్యంలో కథ సాగనుంది.

Comments

G
Loading comments...