Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూటీపైనే గుండెపోటుతో మెకానిక్ మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:18 AM జనగామ General
స్కూటీపైనే గుండెపోటుతో మెకానిక్ మృతి - Ushodayam
జనగామ జిల్లా ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన మోటార్ మెకానిక్ బోడ లింగం (49) గుండెపోటుతో స్కూటీపైనే ప్రాణాలు కోల్పోయారు. మోటార్ రిపేర్ చేయించుకుని తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవలి కాలంలో ఆకస్మిక గుండెపోటు మరణాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది.

Comments

G
Loading comments...