Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిలిండర్ తగిలి యువకుడి దుర్మరణం

Shruthi Nov 28, 2026 3:59 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
సిలిండర్ తగిలి యువకుడి దుర్మరణం - Ushodayam
దిల్లీలోని బిందాపుర్‌లో తల్లితో గొడవపడిన ఓ వ్యక్తి భవనం మూడో అంతస్తు బాల్కనీ నుంచి నిండుగా ఉన్న ఎల్పీజీ సిలిండర్‌ను కిందకు విసిరేశాడు. భవనం కింద నిలబడి ఉన్న సాహిల్ (30) అనే యువకుడి తలపై ఆ సిలిండర్ పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు భవన యజమాని మేనల్లుడు శివమ్ శర్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...