వార్తలకు తిరిగి వెళ్లండి
కుటుంబ కలహాలు.. ముగ్గురు చిన్నారుల మృతి

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను నీటి సంపులోకి తోసి తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషాద ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...
