Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేటలో సమన్వయంతో వార్డులు ఏకగ్రీవం

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:54 PM కడపGeneral
రాజంపేటలో సమన్వయంతో వార్డులు ఏకగ్రీవం - Ushodayam
రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో 32 వార్డులకు 97 మంది కౌన్సిలర్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. కూటమి పార్టీల అభ్యర్థులు పలుచోట్ల పరస్పరం పోటీగా నిలిచారు. ఈ నేపథ్యంలో నేడు కూటమి నేతల మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. సమన్వయం కుదిరితే నామినేషన్ల ఉపసంహరణ అనంతరం దాదాపు అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టీడీపీ 55, వైసీపీ 5, జనసేన 16, బీజేపీ 7, స్వతంత్రులు 14 మంది పోటీలో ఉన్నారు.

Comments

G
Loading comments...