Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి కీలక ప్రకటన

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 5:02 PM అన్నమయ్యGeneral
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి కీలక ప్రకటన - Ushodayam
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎవరికి టికెట్ ఇచ్చినా, అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం రాజంపేటలో మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డుల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు పార్టీకి ప్రతిష్ఠాత్మకమని పేర్కొన్న ఆయన, ప్రజల మద్దతు కూడగట్టేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...