వార్తలకు తిరిగి వెళ్లండి
రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట

ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణకు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఈ కేసులో రాహుల్‌గాంధీకి ఊరట లభించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ అంశాన్ని తాజాగా పరిశీలించాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. విచారణకు ఈ కేసు అర్హమా? కాదా? అన్నది కూడా నిర్ణయించాలని తెలిపింది.
Comments
Loading comments...
