Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ ఏపీలో.. ప్రచారం తెలంగాణలో

Sai Nath Nov 25, 2026 4:08 PM అమరావతిGeneral
Add as a preferred source on Google
పోటీ ఏపీలో.. ప్రచారం తెలంగాణలో - Ushodayam
అనంతపురం జిల్లా తలుపుల మండలం ఓబుళరెడ్డిపల్లి పంచాయతీ ఎన్నికల ప్రచారం హైదరాబాద్‌కు చేరింది. గ్రామానికి చెందిన పలువురు ఉపాధి కోసం నగరానికి వలస వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరి ఓట్లు తన విజయానికి కీలకమని భావించిన కూటమి బలపరిచిన సర్పంచి అభ్యర్థి జయరామ్‌ హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడి గ్రామస్థులను కలిసి నవంబర్‌ 29న జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి ఒకరోజు ముందే గ్రామానికి రావాలని కోరారు.

Comments

G
Loading comments...