వార్తలకు తిరిగి వెళ్లండి
పెళ్లిపీటలెక్కనున్న యువ హీరో

టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్కిటెక్ట్ శిశిర సింహతో ఆయన పెళ్లి ఈ డిసెంబర్‌లో జరగనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు.
నిర్మాత రాజ్ కందుకూరి తనయుడైన శివ.. ‘చూసి చూడంగానే’, ‘గమనం’, ‘మను చరిత్ర’, ‘మనమే’ తదితర చిత్రాల్లో నటించారు. ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Comments
Loading comments...
