Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క రాత్రిలో 17 బావుల వద్ద వైర్ల చోరీ

Follow Ushodayam on Google
Kiran Sep 30, 2026 11:00 AM వికారాబాద్General
ఒక్క రాత్రిలో 17 బావుల వద్ద వైర్ల చోరీ - Ushodayam
నవాబుపేట్‌ మండలం పులుమామిడి, మాదిరెడ్డిపల్లి గ్రామాల్లో దుండగులు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ వైర్లను కత్తిరించి ఎత్తుకెళ్లారు. ఒక్క రాత్రిలోనే దాదాపు 17 బావుల వద్ద వైర్లు చోరీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు నీరు పారించే సమయంలో చోరీలు జరగడంతో సాగు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...