Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జన ప్రాంతాల్లో ఈతగాళ్ల సేవలు

Follow Ushodayam on Google
Kiran Sep 17, 2026 11:36 AM ఆసిఫాబాద్General
నిమజ్జన ప్రాంతాల్లో ఈతగాళ్ల సేవలు - Ushodayam
గణేశ్‌ నిమజ్జన ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సభ్యులు గజ ఈతగాళ్లుగా సేవలందించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివరావు సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో ఈతలో నైపుణ్యం ఉన్న సభ్యులను అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్‌ హరిత ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టాలని తెలిపారు. పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజల భద్రతకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...