Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముగ్గురిని బలిగొన్న పులిని బంధించిన అటవీ అధికారులు

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 9:38 AM హైదరాబాద్General
ముగ్గురిని బలిగొన్న పులిని బంధించిన అటవీ అధికారులు - Ushodayam
మహారాష్ట్ర చంద్రపుర్‌ జిల్లా సావిలీ తాలూకాలో నెలరోజుల్లో ముగ్గురు పశువుల కాపరులను హతమార్చిన టీ-122 పులిని అటవీ అధికారులు బంధించారు. వ్యాహాడ్‌ అటవీ ప్రాంతంలో పులి దాడులతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజల విజ్ఞప్తితో అటవీశాఖ ట్రాప్‌ కెమెరాలు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. శనివారం పులి ఆచూకీ గుర్తించి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బోనులో బంధించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...