Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిగొండ పోలీస్ స్టేషన్ లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

Follow Ushodayam on Google
K.Venkatesh Aug 27, 2026 5:04 PM ఖమ్మంGeneral
ముదిగొండ పోలీస్ స్టేషన్ లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ - Ushodayam
ఖమ్మం సీపీ సునీల్ దత్ ముదిగొండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నమోదు, పెండింగ్ కేసుల స్థితిగతులను పరిశీలించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ పారదర్శక సేవలు అందించాలని తెలిపారు. డయల్ 100 కాల్స్, సైబర్ మోసాల బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...