Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లన్నసాగర్‌ పేలుళ్లపై హరీశ్‌ ఆగ్రహం

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 7:41 AM జాతీయంGeneral
మల్లన్నసాగర్‌ పేలుళ్లపై హరీశ్‌ ఆగ్రహం - Ushodayam
సిద్దిపేట జిల్లా తిప్పారం వద్ద మల్లన్నసాగర్‌ కట్ట సమీపంలో అనుమతుల్లేకుండా పేలుళ్లు జరుపుతున్నారని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం పనులను పరిశీలించి అధికారులపై మండిపడ్డారు. పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని, కట్ట కుంగి నీరు లీకవుతోందని గ్రామస్థులు చెబుతున్నట్లు తెలిపారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేసి, కాంట్రాక్ట్‌ సంస్థపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...