Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవపాడులో ఉచిత వైద్య శిబిరం

Follow Ushodayam on Google
Kiran Nov 03, 2026 6:57 PM జోగులాంబ గద్వాల్ General
మానవపాడులో ఉచిత వైద్య శిబిరం - Ushodayam
ఆరోగ్య నియమాలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని మానవపాడు మండలం అమరవాయి సర్పంచ్ హుస్సేన్ సూచించారు. మంగళవారం భవిష్య భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. షుగర్ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వైద్యుల సలహాలు పాటించాలని కోరారు. శిబిరంలో సుమారు 250 మందికి మందులు పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...