Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి దుర్మరణం

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:45 PM ములుగు General
కుమార్తెను చూసేందుకు వెళ్తూ తండ్రి దుర్మరణం - Ushodayam
ములుగు జిల్లా మంగపేట మండలంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహ్మద్ మెహరాజ్ (24) మృతి చెందాడు. ఆరు నెలల కుమార్తెను చూసేందుకు శుక్రవారం రాత్రి ఏటూరునాగారం నుంచి చుంచుపల్లికి వెళ్తుండగా తిమ్మంపేట క్రాస్‌రోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. మూలమలుపులో వాహనం అదుపుతప్పి పొలంలో పడగా, తల చెట్టుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం రైతుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...