Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోయగూడలో ఇంకుడు గుంత పనులు ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:24 PM ములుగు General
కోయగూడలో ఇంకుడు గుంత పనులు ప్రారంభం - Ushodayam
ఏటూరునాగారం మండలం కోయగూడలో కమ్యూనిటీ ఇంకుడు గుంత నిర్మాణ పనులను సర్పంచ్ సరిత ప్రారంభించారు. లంబాడితండా అంగన్‌వాడీ కేంద్రంలోని చేతిపంపు వద్ద నీరు నిల్వ ఉండకుండా, నీటి పారుదల కోసం VBG RAM పథకం కింద పనులు చేపట్టారు. ఇంకుడు గుంత ఏర్పాటుతో నీటి నిల్వ సమస్య పరిష్కారం అవుతుందని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో RWS ఏఈ చారి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, కారోబార్ ఇరుసవడ్ల రాజు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...