Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండముడుసుపాలెంలో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 3:15 PM ప్రకాశం General
కొండముడుసుపాలెంలో పోలింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ - Ushodayam
కందుకూరు మండలం కొండముడుసుపాలెంలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పి. రాజాబాబు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి గురువారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి, ఎన్నికల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...