Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో నాకాబందీ.. 14 వాహనాలు స్వాధీనం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:37 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కీసరలో నాకాబందీ.. 14 వాహనాలు స్వాధీనం - Ushodayam
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఆదేశాలతో కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లి, బర్షిగూడలో అర్ధరాత్రి నాకాబందీ నిర్వహించారు. జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ ఎలక్షన్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వాహనాల వివరాలను పోలీసులు పరిశీలించారు.

Comments

G
Loading comments...