Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖైదీల పరారీ ఘటన.. ప్రధాన సూత్రధారి అరెస్ట్

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:40 PM జాతీయంGeneral
ఖైదీల పరారీ ఘటన.. ప్రధాన సూత్రధారి అరెస్ట్ - Ushodayam
తమిళనాడులోని తెక్కంపట్టి సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారైన ఘటనలో లింగప్రసాద్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆటోలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతడిని అరెస్టు చేశారు. పరారైన ఖైదీలందరినీ పట్టుకున్నారు. బెయిల్ రద్దు కావడంతో తప్పించుకోవాలని ఖైదీలు పథకం రచించినట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 26న జైలు సిబ్బందిపై దాడి చేసి పరారయ్యారని వెల్లడించారు.

Comments

G
Loading comments...