Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జురెల్‌ కాఫీ మేకర్‌ అవతారం

Follow Ushodayam on Google
SAI NATH Sep 22, 2026 5:56 PM జాతీయంక్రీడలు
జురెల్‌ కాఫీ మేకర్‌ అవతారం - Ushodayam
టీమిండియా వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ కాఫీ మేకర్‌గా మారాడు. ఆస్ట్రేలియన్‌ బరిస్టా కిర్క్‌ పియర్సన్‌ షేర్‌ చేసిన వీడియోలో జురెల్‌ కాఫీ తయారు చేస్తూ కనిపించాడు. కాఫీని తూకం వేయడం, గ్రైండ్‌ చేయడం, బ్రూయింగ్‌ చేయడంతో పాటు కప్పుపై డిజైన్‌ కూడా వేశాడు. జురెల్‌ కాఫీ ప్రియుడని, దాని తయారీలోనూ ఎంతో ఆసక్తి చూపుతాడని పియర్సన్‌ పేర్కొన్నాడు. వీడియోలో అతడు వివిధ రకాల కాఫీలను తయారు చేస్తూ కనిపించాడు.

Comments

G
Loading comments...