వార్తలకు తిరిగి వెళ్లండి
జగన్ వందోసారి బెంగళూరు నుంచి తాడేపల్లికి

మాజీ సీఎం జగన్ మంగళవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరుకు మకాం మార్చిన ఆయన.. రాష్ట్రానికి రావడం ఇది వందోసారి. అప్పటి నుంచి అక్కడే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
వారానికి రెండు, అప్పుడప్పుడు మూడు రోజుల పాటు తాడేపల్లికి వస్తున్నారు. వైకాపా నేతల వివాహాలు, పరామర్శలకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు తన ఇంట్లో బస చేస్తున్నారు.
Comments
Loading comments...
