Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు ఆర్టీసీ ఎన్నికల్లో 23% పోలింగ్‌

Follow Ushodayam on Google
Kiran Oct 09, 2026 9:46 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఇల్లందు ఆర్టీసీ ఎన్నికల్లో 23% పోలింగ్‌ - Ushodayam
ఇల్లందు ఆర్టీసీ డిపోలో శుక్రవారం నిర్వహిస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఇప్పటివరకు 23 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు డిపోకు చేరుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ తాటిపాముల సురేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...