వార్తలకు తిరిగి వెళ్లండి
హోటల్‌లో కాల్పులు.. నలుగురు మృతి

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా ఖరావడ్ సమీపంలోని మిలన్ హోటల్‌లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో నలుగురు యువకులు మృతిచెందారు. వారిలో ముగ్గురు ఝజ్జర్ జిల్లా డీఘల్ గ్రామస్థులుగా గుర్తించారు.
పోలీస్ చౌకీకి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. హిమాంశు, సన్నీ రిటోలియా గ్యాంగ్‌ల మధ్య గ్యాంగ్‌వార్ కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...
