Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ ఆంథోనీ క్లార్క్‌ కన్నుమూత

Sai Nath Nov 13, 2026 4:43 PM జాతీయంవినోదం
Add as a preferred source on Google
హాలీవుడ్‌ నటుడు, కమెడియన్‌ ఆంథోనీ క్లార్క్‌ కన్నుమూత - Ushodayam
ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, స్టాండప్‌ కమెడియన్‌ ఆంథోనీ క్లార్క్‌ (62) కన్నుమూశారు. నవంబర్‌ 10న ఆయన మరణించగా.. న్యుమోనియా సంబంధిత సమస్యలే ఇందుకు కారణమని డెడ్‌లైన్‌ కథనం వెల్లడించింది. ఆయన మృతిని మరుసటి రోజు ‘యెస్‌, డియర్‌’ సహనటుడు మైక్‌ ఓ మాలీ ప్రకటించారు. ‘యెస్‌, డియర్‌’లో గ్రెగ్‌ వార్నర్‌గా గుర్తింపు పొందిన క్లార్క్‌ మృతిపై సహనటులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

Comments

G
Loading comments...