Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీలో 38.36 టీఎంసీల నీరు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 9:47 AM జగిత్యాలGeneral
ఎస్సారెస్పీలో 38.36 టీఎంసీల నీరు - Ushodayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 38.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం ఉదయం నీటిమట్టం 328.39 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 48 శాతం నీరు అందుబాటులో ఉంది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేదు. ప్రాజెక్టు నుంచి 735 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ఇందులో మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు సరఫరా చేస్తుండగా, ఆవిరి రూపంలో 504 క్యూసెక్కుల నీరు నష్టపోతోంది.

Comments

G
Loading comments...