వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
డ్రైనేజీలో అప్పుడే పుట్టిన శిశువు

విశాఖపట్నంలోని మువ్వలవానిపాలెం పిఠాపురం కాలనీలో డ్రైనేజీలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును గొనెసంచిలో పెట్టి డ్రైనేజీలో పడేశారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు గుర్తించి బయటకు తీసి కాపాడారు.
సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు అక్కడికి చేరుకుని శిశువును చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
