వార్తలకు తిరిగి వెళ్లండి
డిసెంబర్‌కు ‘మైసా’ వాయిదా ?

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మైసా’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. నవంబర్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా డిసెంబర్ 4న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ చిత్రంలో రష్మిక గిరిజన యువతిగా నటిస్తున్నారు. విడుదల తేదీపై నిర్మాతల అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...
