Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకున్న గ్రామస్థులు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 9:57 AM ఖమ్మంGeneral
చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకున్న గ్రామస్థులు - Ushodayam
తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో సోమవారం ఇంట్లో చోరీకి యత్నించిన వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామానికి చెందిన సలిగంటి లింగయ్య మెకానిక్‌ పనులకు వెళ్లిన సమయంలో నిందితుడు ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. అదే సమయంలో లింగయ్య రావడంతో స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. అతడు కామేపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసుపై విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...