Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం దొంగిలించి.. బంధువుకే పూజ ఆహ్వానం

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 6:36 PM జాతీయంGeneral
బంగారం దొంగిలించి.. బంధువుకే పూజ ఆహ్వానం - Ushodayam
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మామ ఇంట్లో బంగారం దొంగిలించిన 19 ఏళ్ల సమర్‌ పోపట్‌ చవాన్‌.. ఆ సొమ్ముతో కారు కొనుగోలు చేసి, వాహన పూజకు మామనే ఆహ్వానించాడు. నెల క్రితం ఆభరణాలు దొంగిలించి విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బంగారం పోయినట్లు మామ ఫిర్యాదు చేయగా, సమర్‌ ఖరీదైన కారు కొనడం పోలీసులకు అనుమానం కలిగించింది. దీంతో అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది.

Comments

G
Loading comments...