Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ రీ సర్వేను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:46 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
భూ రీ సర్వేను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి: కలెక్టర్ - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెంలో జరుగుతున్న భూ రీ సర్వేను కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. ఇప్పటివరకు 50.20 ఎకరాల్లో సర్వే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. భూముల సరిహద్దులు, సర్వే మ్యాప్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లకు తావులేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం సర్వే పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...