Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘అర్నబ్‌’ తుఫానుపై అప్రమత్తం: మంత్రి అనిత

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 12:00 PM అమరావతిGeneral
‘అర్నబ్‌’ తుఫానుపై అప్రమత్తం: మంత్రి అనిత - Ushodayam
‘అర్నబ్‌’ తుఫానును ఎదుర్కొనేందుకు ఏపీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, పోలీసు, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు 24 గంటలూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అత్యవసర సాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని ప్రజలకు తెలిపారు.

Comments

G
Loading comments...