Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Oct 15, 2026 3:12 PM బాపట్లGeneral
అద్దంకిలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ - Ushodayam
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం అద్దంకిలో పోలీస్ చెక్‌పోస్ట్, కట్టకిందపాలెం ఎంపీపీ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. సమస్యాత్మక కేంద్రాల వివరాలను తెలుసుకున్నారు. డీఎస్పీ, సీఐలతో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...