Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10 గంటలైనా తెరుచుకోని పశువైద్యశాల

Follow Ushodayam on Google
Kiran Sep 22, 2026 12:42 PM మెదక్General
10 గంటలైనా తెరుచుకోని పశువైద్యశాల - Ushodayam
హవేలిఘనపూర్‌ మండల కేంద్రంలోని పశువైద్యశాల మంగళవారం ఉదయం 10 గంటలు దాటినా తెరుచుకోలేదని పాడి రైతులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పశువులతో వచ్చిన రైతులు వైద్యం కోసం వేచి చూశారు. పశువులను చూసేందుకు రావాలని కోరినా సిబ్బంది నిరాకరించారని రైతులు ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులను పంపిస్తామని, డబ్బులు చెల్లించాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...