Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

174 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 05, 2026 5:08 PM జాతీయంక్రీడలు
174 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్‌ - Ushodayam
ఆస్ట్రేలియా అండర్‌-19తో రెండో అనధికారిక టెస్టులో భారత స్పిన్నర్‌ తన్మయ్‌ బలోడా 6 వికెట్లతో చెలరేగాడు. దీంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. అయాన్‌ అక్రమ్‌ రెండు, మోహిత్‌ ఉల్వా, ప్రియాన్షు సింగ్‌ చెరో వికెట్‌ తీశారు. ఆసీస్‌ బ్యాటర్లలో చార్లీ హెండర్సన్‌ 37 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నీల్‌ పటేల్‌ 31, జేకబ్‌ పీట్జ్‌ 26 పరుగులు చేశారు.

Comments

G
Loading comments...