Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్‌ను కరవు మండలంగా ప్రకటించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:35 AM నిర్మల్ General
తానూర్‌ను కరవు మండలంగా ప్రకటించాలి - Ushodayam
తానూర్ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున కరవు మండలంగా ప్రకటించాలని బీజేపీ మండల అధ్యక్షుడు పూండ్ర లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని 32 పంచాయతీలు వర్షాధారంగా ఉండగా, జిల్లాలోనే ఇక్కడ అత్యల్ప వర్షపాతం నమోదైందన్నారు. బోరుబావుల్లో నీరు లేకపోవడం, విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...