Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షఫాలీ వర్మకు ఐసీసీ మందలింపు.. డీమెరిట్ పాయింట్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 5:34 PM జాతీయంక్రీడలు
షఫాలీ వర్మకు ఐసీసీ మందలింపు.. డీమెరిట్ పాయింట్‌ - Ushodayam
భారత మహిళల స్టార్‌ ఓపెనర్‌ షఫాలీ వర్మపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. జింబాబ్వేతో రెండో టీ20లో క్యాచ్‌ జారవిడిచిన తర్వాత బంతిని నేలకేసి విసిరినందుకు ఆమెను మందలించి, ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ చేర్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.2ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఇదే మ్యాచ్‌లో షఫాలీ 25 బంతుల్లో 55 పరుగులు చేసింది.

Comments

G
Loading comments...