Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు భూమి సంరక్షణ ప్రతి రైతు బాధ్యత

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 1:22 PM సిద్దిపేటGeneral
సాగు భూమి సంరక్షణ ప్రతి రైతు బాధ్యత - Ushodayam
సాగు భూమిని సంరక్షించడంతోపాటు, సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవడం ప్రతి రైతు బాధ్యత అని రాయపోల్ ఏవో నరేశ్ సూచించారు. సోమవారం వడ్డేపల్లిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్‌’ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. అవసరానికి మించి రసాయన ఎరువులు,పురుగుమందులు వాడటం వల్ల నేల సహజ స్వభావం దెబ్బతింటుందని నరేశ్ తెలిపారు.భూసారాన్ని కాపాడుకునేలా వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...