Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు ఇంట్లో భారీ కింగ్ కోబ్రా కలకలం

Follow Ushodayam on Google
K Anuradha Sep 20, 2026 10:11 AM శ్రీకాకుళంGeneral
రైతు ఇంట్లో భారీ కింగ్ కోబ్రా కలకలం - Ushodayam
ఆమదాలవలస మండలం రామచంద్రాపురం గ్రామంలో ఓ రైతు ఇంట్లోకి శనివారం రాత్రి భారీ కింగ్ కోబ్రా చొరబడటంతో తీవ్ర కలకలం రేగింది. ఇంట్లో పామును గమనించిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. అనంతరం పామును సురక్షితంగా పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచించారు.

Comments

G
Loading comments...